ఇవాల్టి రోజుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు చేతుల్ని చుట్టేసుకుని కట్టి పడేస్తున్నాయి లెదర్ బ్రేస్ లెట్స్. కాలేజీ కి వెళ్ళే టీనేజర్స్ కి రాక్ స్టార్ లుక్ తెచ్చేలా రకరకాల బ్రేస్ లెట్స్ వస్తున్నాయి. సన్నటి లెదర్ తాళ్ళతో రెండు మూడు రంగులు కలిపి లెదర్ స్ట్రాప్స్ లో అక్షరాలు గుచ్చినవి హృదయాకారం, నక్షత్రాలు, పక్షులు, బొమ్మలు డిజైన్స్ ఎన్నో రకాలు జీన్స్, టీ షర్టులు, స్కర్టులు, గౌన్లు వేటి మేడకైనా సరే బాగుంటాయి. అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలనుకున్నా పెద్ద పెద్ద రెయిన్ స్టోన్స్ పొదిగిన చెల్డ్వాట్ ల డిజైన్లు పువ్వులాంటి లాకెట్లు అమర్చినవి వున్నాయి. సన్నని లెదర్ తాళ్ళు అంటించి అచ్చంగాజుల్లాగా కూడా వున్నాయి బ్రేస్ లెట్స్. ఇవి చేతులకు కొత్త అందానిచ్చాయి అని చెప్పడం లో సందేహం లేదు. ఈ లెదర్ అందాలు ఇప్పుడే ఆన్ లైన్ లో ఆలస్యం ఎందుకు?

Leave a comment