ఎన్నెళ్ళ నుంచి ఈ హింస

ప్రసిద్ద మలయాళ నటి పార్వాతి తన జీవతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మీటు ఉద్యమ స్ఫూర్తితో బయటపెట్టారు. నేను బాధితురాలినే అన్నారామే. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సంఘటన నా నాగేళ్ళ వయసులో జరిగింది. కానీ అప్పుడు జరిగింది తప్పు అని నేను తెలుసుకొనేందుకు 17 ఏళ్ళు పట్టింది. మళ్ళీ దాన్నీ గురించి మాట్లాడేందుకు ఇంకో పదేళ్ళు పట్టింది. ఆ సంఘటన మరిచిపోవాలని ఎంతో ప్రయత్నం చేశానో చెప్పలేను. ఒక సారి లైంగిక దాది జరిగాక ప్రశంతంగా మామూలుగా ఉండలేము. గతం తాలూకూ ఆలోచనలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. లైంగిక బాధితురాలిగా ఉండటం అంటే శారీరక గాయం వంటిదిగా ఉండదు, ఇది మానసిక క్షోభ. ఇందులోంచి బయటపడాలంటే ఎంతో మానసిక ధైర్యం కావాలి అంటోంది పార్వతి. నిజమే లైంగిక హింస శారీరక గాయం కానేకాదు .గాయం మానుతుంది ,మానసిక గాయం జీవితకాలం వెంటాడుతుంది.