చేతులు శుభ్రంగా ఉంచుకోండి

నిజానికి మన సంప్రదాయంలో బయటినుంచి ఇంటికి వచ్చినపుడు, కాళ్ళు ,చేతులు కడుక్కునే సంప్రదాయం ఉండేది. ఈ ఆధునిక కాలంలో బయట బూట్లు చెప్పులు వదిలేసి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం. ప్రస్తుత పరిస్థితిలో వ్యక్తగత శుభ్రత పాటించటం ఒక్కటే కరోనా నుంచి తప్పించుకునేందుకు దొరికిన ఏకైక మార్గం. బయట నుంచి లోపలకి వచ్చిన, లేదా రోజంతా ఇంట్లో ఉన్నా,చేతులతో ఎన్నో వస్తువులు తాకుతాము. కాబట్టి లిక్విడ్ సబ్బుతో  గంటకోసారి చేతులు కడుక్కోవాలి. ఇలా చేతులు కడుక్కోవడం వల్ల కడుపులో వచ్చే ఇన్ఫెక్షనులు డయేరియా వంటి వ్యాధులు కూడా దగ్గరకు రాకుండా పోతాయి. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం కరోనా రాకుండా తీసుకునే జాగ్రత్తలలో ముఖ్యమైన అంశం.