ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక చోట బ్యాక్తీరియా వుండి  పోతుందనీ వంటగది గట్టు కూరగాయలు కట్ చేసే బోర్డులు . ఇలా చాలా వస్తువుల వల్ల  బ్యాక్తీరియా ఆహార పదార్ధాల్లోకి వెళ్లి ఆరోగ్య హానికి కారణం అవుతుందనీ అంతకుముందు ఎన్నో పరిశోధనలు తేల్చాయి. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ క్రీములు కిచెన్ టవల్స్ లోనే చేరుతున్నాయని వీటివల్లే  ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని పరిశోధనలు చెపుతున్నారు. ఎన్నో కిచెన్ లో వంట చేసేవాళ్ల పై వీడియోలు తీసి ఈ పరిశోధనలు చేసారు. అన్నింటికన్నా టీ టవల్స్ పైన కాలుష్యం వుందని  తేలింది. ఇంకో ముఖమైన విషయం మనం ఎప్పుడూ శుభ్రం చేయని చేసేందుకు అవకాశం లేని సెల్ ఫోన్స్ లో ఎన్నెన్నో సూక్ష్మజీవులు ఉంటున్నాయని మనతో పాటు ఎంతో కాలుష్యంతో ప్రయాణం చేసే ఈ ఫోన్ లని యధాతధంగా వంటింట్లోకి తీసుకుపోతాం కిచెన్ టవల్స్ తో పనిచేస్తూ ఫోన్ లు మాట్లాడుతూ ఉంటాం ఇలా కూడా ఎంతో బాక్టీరియా వంటింట్లోకి చేరుతుందంటున్నారు. కొన్నింటిని మన జీవితం లోంచి ఎవాయిడ్  చేయటం కుదరదు కనుక ఈ సందర్భాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎవరికివాళ్లు ఆలోచించుకోవాలి.

Leave a comment