Categories
Gagana WoW

స్కూల్ మొత్తానికి ఒక్కతే అమ్మాయి

షకీనా ముఖియా ‘వాయిస్‌ ఆఫ్ ఇండియా కిడ్స్‌’ రియాలిటీ సింగింగ్ కాంపిటీషన్ ద్వారా ప్రపంచం ముందుకు వచ్చింది. ఆరవ తరగతిలో అస్తమానం పాటల ప్రోగ్రాం కోసం సెలవులు పెడుతూ ఉంటే అటెండెన్స్ లేకపోవడంతో ఆమెను తరువాతి తరగతికి ప్రమోట్ చేయమన్నారు స్కూలు యాజమాన్యం. నాకు పాఠాలు బాగా వచ్చు నన్న వినిపించుకోలేదు . ఇప్పుడు డెహ్రాడూన్ కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ బాయ్స్ స్కూల్ వాళ్ళు , వాళ్ళ ‘ఓన్లీ బాయ్స్‌’ నిబంధనను పక్కకు పెట్టి షకీనాకు స్కూల్లో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు స్కూలు మొత్తానికి షకీనా ముఖియా ఒక్కతే అమ్మాయి. ఈ స్కూల్లోనే మన మాజీ ప్రధాని విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ (వీపీ సింగ్), బాలీవుడ్ నటుడు రాజ్‌ కపూర్‌ చదువుకున్నారు.

Leave a comment