ఎంతో మంది స్త్రీ లలో పోషకాహార లోపం వల్ల వచ్చే రక్త హీనత కనిపిస్తుందని ఒక రిపోర్టు. ఇందుకు ఆహార పరమైన మార్పులు చూసుకుంటే చాలు. చాలా సామాన్యమైన పదార్ధాల్లో ఇనుము పుష్కలంగా దొరుకుతుంది. వేయించిన సెనగ పప్పు, ఉలవలు, బొబ్బర్లు, పెసర్లు, ఎర్ర కందిపప్పు రాగుల్లో ఇనుము వుంటుంది. కరివేపాకు, గోంగూర, పుదీనా, మెంతి కూర, మునగాకు చెంచా నువ్వులు, బాదం, పిస్తాల్లోనూ ఇనుముంటుంది. నేలసరిలో రక్తస్రావం వల్ల ఐరన్ లోపం వస్తే డాక్టర్లు పోషకాహారం, సప్లిమెంట్లు ఇస్తారు. ఈ మందులను కాఫీ టీ లతో వేసుకోకూడదు.

Leave a comment