Categories
WoW

శాకాహారమూ బలవర్థకమే

శాకాహారం లో  ఎలాంటి బలం వుండదన్నది వట్టి అపోహ మాత్రమే నని ఇప్పటికే  పలు పరిశోధనలు రుజువు చేశాయి  . మాంసాహారానికి బదులుగా  పప్పు ధాన్యాలు  శరీరానికి కావల్సిన  మాంసకృత్తులు  ఇస్తాయి . పాలకు బదులు  సోయా పాలు ఇంకా శ్రేష్ఠం . ఆకు కూరలు , కూరగాయలు  ,మెలకెత్తిన విత్తనాల్లో విటమిన్లు  ఖనిజ లవణాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని , జంతు ఉత్పత్తుల్లో  ధీటుగా  ఈ శాకాహారం శరీర ధారుడ్యానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు .జర్మనీ వెయిట్‌ లిఫ్టర్‌  పాట్రిక్‌  బాబోమియాన్‌ ,ఆస్ట్రేలియన్‌ బాడీ బిల్డర్‌  బిల్లీ సిమ్మండ్స్‌ మొదలైన  వాళ్లు  శుద్ధ శాకాహారులే  శాకాహారుల జనాభా పెరుగుతుందని ,ఆరోగ్య స్పృహ ,పర్యావరణ స్పృహ మెరుగుపడటమే ఈ పరిణామానికి కారణం అని  అంతర్జాతీయ నిపుణులు  చెపుతున్నారు .

Leave a comment