Categories
Nemalika

అనవసర కబుర్లు అతి జోకులు వద్దు

నీహారిక,

నీవు అడిగినట్లు సోషల్ గేదరింగ్స్ లో మనం కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. ముందుగా ఆ సందర్భానికి తగినట్లు డ్రెస్ వేసుకోవాలి. మరీ క్యాజువాల్ గా లేదా మరీ లావిష్ గా ఉండకూడదు. క్లాసీ బాలెన్స్ అనుసరించాలి. గేదరింగ్స్లో డబ్బు గురించి అస్సలు మాట్లాడవద్దు. ఇలాంటి సందర్భం గురించి అయినా సరే అందరితో కలివిడి గా మాట్లాడాలి. అనవసరపు కబుర్లు అతి జోకులు అయితే అస్సలు కూడదు. మన సమక్షం పది మందికి ఆనందం ఇచ్చేదిగా వుండాలి. చక్కని మాటలు, చెదరని చిరునవ్వు హుందాతనాన్ని ఇస్తాయి. ప్లీజ్, ధాంక్యు, సారీ వంటి పదాలు వ్యక్తీత్వాన్ని ఇనుమడింప జేస్తాయి. గొప్పలు చెప్పుకోవడం, ఎదుటివాళ్ళు చెప్పేది వినక పోవడం వంటివి ఎప్పటికీ తావీయవద్దు.

Leave a comment