నీహారికా,
కొన్ని విషయాలు చెప్పినంత తేలికగా సాధ్యపడతాయి అనిపిస్తుంది. కానీ తప్పని సరిగా చేయాలిగా…. జీవితంలో ఒడిదుడుకులు సహజం. కష్టం వస్తే దాన్నే పట్టుకుని వేలాడటం, సంతోషం వస్తే అదే జీవితం అనుకోవడం తప్పే. ప్రతి విషయాన్నీ పాజిటివ్ గా తీసుకోవాలి. మంచి వైపుకు తొంగి చూడాలి. విశ్వం అందించే ఎన్నెన్నో అవకాశాలు ఆశ్చర్య పెడతాయి. ఏ అంశం ఏ పరిస్తితి, ఏ అవకాశం కూడా ఇదే చివరిదిగా భావించ కుడదు. చేతులు సాచి జీవితపు అనుభూతులను అనుకూల దృక్పదంతో ఆలోచనలతో అందుకోవాలి. అన్ని రకాల సంతోషాలు, ప్రేమానురాగాలు ఆప్యాయతలు అంది పుచ్చుకోవాలి. జీవితంలో ఇవ్వటానికి, షేర్ చెయ్యటానికి ఎంతో వుంటుంది. అటువంటి అవకాశాలను అనుకూలమైన ఆలోచనలతో సరికొత్త జీవితాన్ని అంది పుచ్చుకోవాలి. కానీ ఒక్కటే ప్రశ్న. ఇది సాధ్యమా? అని అనుకొన్నంత సులభం కాకపోవచ్చు. కానీ తప్పని సరిగా ప్రయత్నించి, ప్రాక్టిస్ చేయవలసిన విషయం ఇది. జీవితం చాలా అందమైన దాన్నీ మనసారా ఆస్వాదిస్తు ఎప్పటికప్పుడు ఓపెన్ గా వుండాలి. జీవితానికొ అర్ధాన్ని ఇచ్చుకోగలగాలి. ప్రతి కొత్త రోజు కోసం ఎదురు చూస్తూ హాయిగా ఎంజాయ్ చేయగలగాలి. ఇలాంటి పద్దతిని ప్రయత్నించి అలవరుచుకోవాలి.