Categories
Soyagam

డీప్ కండీషనింగ్ ట్రీట్మెంట్ అవసరం.

రెగ్యులర్ గా కండీషనింగ్ చేసినా జుట్టు చిక్కులు పడిపోతుందని చాలా మంది కంప్లయింట్ చేస్తుంటారు, అయితే శిరోజాలకు నరీష్ మెంట్ చికిత్సలు ఇవ్వడమే అన్నింటికంటే ఉత్తమ మైన పద్దతి. వారానికి ఓ సారీ డీప్ కండీషనింగ్ ట్రీట్ మెంట్ చేయాలి. మంచి కండీషనర్, మాస్క్, ఇతర రిపేర్ ఉత్పత్తులని రెగ్యులర్ గా వాడాలి.ఆరోగ్యవంతమైన మాడు, శిరోజాల కోసం ఆయిలింగ్ తప్పనిసరి. రాత్రి వేళ తలకు నూనె పట్టించుకుని మరునాడు వాష్ చేయాలి. అలాగే సరైన పోషకాలు అందాకా జుట్టు రాలిపోతూ వుంటుంది. బి విటమిన్ లోపం లేకుండా ఐరన్, అయోదిన్ తగ్గకుండా చూడాలి. కొబ్బరి నూనె లో ఎండబెట్టిన ఉసిరి కాయ ముక్కలు వేసి కాచాలి. ఇది హెయిర్ ఆయిల్ లాగా వాడుకోవాలి. తోట కూర, పాలకూర రసాలు తాగుతుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Leave a comment