ఆమె రామలక్ష్మి ఆరుద్ర తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక్ ముద్ర వేసుకున్న రచయిత్రి. భాసా సుబ్బారావు వంటి దిగ్గజాల వద్ద జర్నలిజం పాఠాలు నేర్చుకున్నారు. ఆరుద్ర ను పెళ్ళిచేసుకున్నారు. ఆమె 300 రచనలు చేసారు. జీవానజ్యోతి గోరింటాకు వంటి సినిమాలకు కధ సమకూర్చారు. పరిశోధనలు జాహిత చరిత్రలు, అన్నమయ్యా మొదలైనవి ఆమె విశిష్టరచనలు నవలలు 30 వరకు రాసారు. 60,70 దశకంలో తెలుగు రచయిత్రిలే సాహిత్యంలో ఎక్కువగా కనబడేవారు. ఇప్పుడు ప్రఖ్యాతులైన ఎందరో రచయిత్రిలు రామలక్ష్మి గారి సమకాలీకులు. ఇప్పుడు రచయిత్రుల నవలలన్ని రీప్రింట్స్ అవుతున్నాయి. ఒక తరం మనోభావాలు, స్త్రీలు అన్ని రకాలుగా ఎదిగిన క్రమం గురించి, తెలుసుకోవాలంటేనే తప్పనిసరిగా చదవవలసిన రచయిత్రి ఈమె శ్రీవారి ధోరణి అంటూ నేను రాయలేదు కానీ రచనల్లో కేవలం స్త్రీల గురించే రాసాను. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, సమాజం వారిపట్ల చూపిస్తున్న ధోరణి గురించి రాసాను అంటారు రచయిత్రి రామలక్ష్మి ఆరుద్ర.