నీహారికా,
వ్యక్తుల మద్య పరిచయం పెరిగే కొద్దీ గౌరవం తగ్గి నిర్లక్యం వస్తుందని ఒక సామెత ఉంది. కానీ భార్య భర్తల మద్య రోజులు గడిచే కొద్ది అవగాహన పెరిగి ఆ భాంధవ్యం మరింత పెరగాలి. పెళ్ళైన 11 నెలల 24 రోజుల తర్వాత భార్య భర్తల మద్య బంధం సుఖానుబంధంగా మారుతుందని ఒక పరిశోధన ఫలితం. ఈ సుఖాను బంధం అంటే ఒక కంఫర్ట్ జోన్ ఎంత ఆరోగ్యకరంగా ఉంటే అంతగా ఆ సంసారం సుఖంగా సాగుతుంది. దానికి భార్య భర్తలు ఇద్దరు ఎఫర్ద్ పెట్టాలి. ఒకరి ఇష్టాలు ఒకరు గౌరవించూకొంటూ, ఒకరి బలహీనతలు ఒకరు సరదాగా తీసుకొంటూ ప్రయాణం కొనసాగించాలి. కలసి జీవించటం అంటే ఎదుటి వారి బలాల్ని, బలహీనతలను, ఇష్టాన్ని, అయిష్టాన్ని తమవిగా భావించి తమవైపు నుంచి సానుకూలంగా స్పందించాలి. ఈ తరం భార్య భర్తల మద్య మనుష్యులు దూరంగా ఉన్న టేక్నోలజి వాళ్ళను దగ్గరగానే కట్టి కలిసి ఉంచుతుంది. ఆఫీస్ లో, షాపింగ్ లో, ఇంట్లో, దూరంతాల్లో ఇద్దరు ఒకే మాటగా కలిసి ఉండేందుకు చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ చాలు. మనసుల్ని కలిపి ఉంచుకూవాలంటే ఎన్ని దార్లు లేవు కాకపోతే ఈ బంధం కలకాలం పదిలంగా ఉంచుకోవాలని నిర్ణయించుకోవాలి. అంతే.