Categories
Soyagam

నిమిషాల్లో మెరుపునిచ్చే ప్యాక్.

గుడ్లు, క్యారెట్లు, పెరుగు మంచి ఆహారం మాత్రమే కాదు. కొంచెం ద్రుష్టి మర్చి చుస్తే అవి గొప్ప సౌందర్య పోషకాలు చర్మాన్ని మెరిపించే చక్కని ఫేస్ ప్యాక్స్ కుడా పొడి చర్మం తాజాగా అయిపోవాలంటే గుడ్డులోని తెల్లసొనలో బాదం పప్పు పొడి కలిపి ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే దీనికి ఖరీదైన ప్యాక్ లు సాటి రావు. రెండు క్యారెట్స్ ఉడికించి మెత్తని గుజ్జుగా చేసి ఇందులో తేనె కలిపి ప్యాక్ లా వేసుకోవాలి. అలాగే పెరుగులో కమలాపండు రసం కలిపి ముఖానికి మర్దనా చేసినా చర్మం బావుంటుంది. ఏదైనా స్పెషల్ అకేషన్ వుంటే ముందుగా ఈ పెరుగు కమలాపండు ప్యాక్ నిమిషాల్లో మొహం మెరిసేలా చేస్తుంది. అరటి పండు గుజ్జు, పెరుగు తేనె కలిపిన మిశ్రమం ఇంకో అద్భుతమిన రిజల్ట్ ఇచ్చే ప్యాక్. ఎలాంటి సైడ్ ఏఫెక్ట్స్ లేని ఈ ప్యాక్ లు నిరభ్యంతరంగా ట్రై చేయచ్చు.

Leave a comment