Categories
ఆహారంలో వెల్లుల్లి వాడకం మంచిదని తెలుసుకుని వెల్లుల్లి నూనె తో జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వెల్లుల్లి లో దొరికే సెలీనియం అనే పదార్ధం వెంట్రుకలకు అవసరమైన ఇ విటమిన్ ఇస్తుంది. ఇది జుట్టు చిట్లి పోకుండా కాపాడుతుంది. వెల్లుల్లి లో వుండే సి, బి, బి2 విటమిన్లు మాడు కణాలలో రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడి జుట్టు పెరుదలకు సహకరిస్తాయి బట్టతల రానివ్వవు. ఇందులోని ఇనుము, ఖనిజాలు విటమిన్లు జుట్టు పొడుగ్గా పెరిగేలా చేస్తాయి. వెల్లుల్లి నూనె తో మాడు పై మసాజ్ చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది. ఇందులోని సల్ఫర్ వెంట్రుకల కుదుళ్ళను బలపరిచే కెరోటిన్ ను ఉత్పత్తి చేస్తుంది.