ణీహారికా,

చాలా చిన్నగా ఉన్నప్పుడే కాలేజీ, హాస్టల్ అనుభవం లోకి వచ్చేస్తున్నాయి. కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు, కాలేజీలో వుంటుంది. కానీ స్నేహితులను సంపాదించుకుని ఒక వంటరి తనం పోగొట్టుకోవడం మరీ కష్ట అయితే కాదు. అందరు కొత్త వాళ్ళే గనుక, ఒకే వయస్సు వాళ్ళు దాదాపుగా ఉంటాయి కనుక పలకరించి పరిచయం చేసుకోవచ్చు. ఎక్కడ నుంచి, ఏ గ్రూప్ తో మొదలు పెడితే మాటల్లో పడిపోయి దగ్గరై పోతుంది. అవతలి వాళ్ళు కుడా ఎవరితోనైనా తొందరగా స్నేహం కలిపితే బావుండు అన్న అభిప్రాయంతో వుంటారు కనుక పెద్ద సమస్య కుడా కాదు. ఎంత మందిలో వున్నా, ఎవరి ప్రత్యేకట తో నడుచుకునే విధానం తో ఎదుటి వాళ్ళతో స్నేహం కలుపుకోగలరు కాలేజీలో వివిధ కార్య క్రమాలు మొదలవ్వుతాయి. ఫ్రెషర్స్ అందరు ఒకళ్ళ నొకళ్ళు కలుసుకుని స్నేహానికి చెఇచాస్తారు. ఇప్పుడే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. జీవితంలో తోడుగా వుండే  స్నేహితురాళ్ళను కలుసుకోమ్తారు. ఆ అపురూపమైన స్నేహ పరిమళాన్ని సంతోషంగా ఆస్వాదించాలీ. అపురూపంగా గుండెకు హత్తుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళనోకళ్ళు హార్ట్ చేసుకోరాదు ప్రేమని మాత్రమే రెండు చేతులా ఇవ్వాలి. అంటే స్నేహితుల మద్యని వుండేది మమకారం మాత్రమే.

Leave a comment