Categories
ఒత్తిడి ఉన్నా, డిప్రెషన్ వున్నా, ఎక్కువసేపు కుర్చుని వున్నా నడుము, పిరుదుల మధ్య కొవ్వు పేరుకుపోతుంది. ఇది స్త్రీలలోనే అధికం. స్కిప్పింగ్ యోగాసనాల వల్ల మాత్రమే ఈ కొవ్వు కరిగించుకోవడం సాధ్యం. అలాగే పొట్ట దగ్గర, మోచేతుల పైన గల కొవ్వు చేతుల వ్యాయామాలు బరువులెత్తడం యోగా వల్లనే ఫలితం వుంటుంది. చాతీ భాగంలో ఫ్యాట్ ఎక్కువగా వుంటే బ్రిస్క్ వాకింగ్ ఒక్కటే మర్ఘం. ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటేనే పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. శరీరం మొత్తం నాజుగ్గా వున్నా ఇలా నడుము చుట్టూ, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటే శరీరం తీరు మారిపోతుంది. కొవ్వు చేరకుండా జాగ్రత్త పడాలి లేదా పేరుకుంటే యోగా చేయాలి.