Categories
స్పోర్ట్స్ పానీయాలకన్నా పాలు, నీళ్లు మంచివంటున్నారు ఎక్స్ పర్ట్స్ సాధారణంగా వ్యాయామం చేశాక చాలా మంది ఎనర్జీకోసం స్పోర్ట్స్ పానీయాలు తాగుతారు . ఈ స్పోర్ట్స్ డ్రింక్ కన్నా పాలు తాగటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చునంటున్నారు. పాలలోని కాల్షియం , విటమిన్ ఎ, బి వ్యాయామం , ఆటల తర్వాత శరీరం డీ-హైడ్రేడ్ కాకుండా కాపాడతాయని చెపుతున్నారు. చల్లని నీళ్లు ఇచ్చే మంచి ఫలితాలు కూడా ఈ డ్రింక్స్ ఇవ్వలేదని ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాయామం తర్వాత ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోని తర్వాత ఓ గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగితే మంచి ఫలితం పొందవచ్చునని వారు సూచిస్తున్నారు. కోల్పొచిన శక్తి ఇవ్వడంలో పాలు ఎంతో ఉపయోగపడతాయంటున్నారు.