Categories
కొత్తగా ఇళ్ళు కట్టుకున్న లేదా అద్దె ఇళ్లలో ఉన్నా మేకులు కొట్టడం పెద్ద సమస్య. కొత్త ఇంట్లో మేకు కోట్టలేము. ఇంటి ఓనర్ వద్దంటాడు. మరి ఇప్పుడు ఎదైనా తగిలించుకోవాలంటే ఎలా? డబుల్ సైడ్ సెక్షన్ కప్ ప్యాడ్లు మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటిని బాత్ రూంలో , వంట గదిలో, టైల్స్ కు అంటించవచ్చు.ఈ సెక్షన్ ప్యాడ్ పైన ఏ వస్తువు పెట్టిన కిందపడిపోకుండా పట్టుకుని ఉంచుతాయి. బోలెడన్ని మోడల్స్ చేతులు, కాళ్ళు, చేపలు, ఆపిల్స్. సీతాకోకచిలుకలు ఇలా ఎన్నో రకాల రూపాల్లో రంగుల్లో ఇంటికి అందం తెచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా టైల్స్ కు మేకులు కొట్టడం కుదరదు కనుక ఇవి అంటిస్తే చక్కగా ఉంటాయి.