Categories
పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం చాలా కష్టమైన బాద్యతే ఒక వయసు వచ్చే దాక పర్లేదు తర్వాత వాళ్ళు శారీరంకంగా బలపడ్డతర్వాత టీనేజ్ లోకి వచ్చాక వాళ్ళను తిట్టి కొట్టి అదుపులో పెట్టాలనుకోవడం అవివేకం. అలా చేస్తే అప్పటి వరకు ఉన్న భయం కూడా పోయినట్లే పిల్లలు తల్లిదండ్రుల ప్రతిరూపాలు తల్లిదండ్రులను బట్టి,పెరిగిన పరిణామాలను బట్టి వాళ్ళ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది.అందుకే ముందు నుంచి పిల్లలతో ఎక్కువసేపు గడపాలి, తెలిసో తెలియకో తప్పుయ చేస్తే మరి కోపగించుకోవద్దు.పిల్లల పెంపకంలో ప్రేమ ఓర్పు శ్రద్ద అర్ధం చేసుకోవడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.దండనతో అన్ని సాధించగలమని అనుకోవడం పొరపాటే.