Categories

నిద్ర వచ్చేదాకా టి.వి చూస్తూ ఒక్కసారిగా దాన్ని అలా వదిలేసి నిద్రపోతూ ఉంటారు. అయితే టెలివిజన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతులు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. నిద్ర తగ్గిపోతుంది.ఏ మాత్రం సౌండ్ హెచ్చుతగ్గినా మెలుకువ వచ్చేస్తుంది. ఒక వేళ ఏదో ఒకటి వింటు నిద్రపోయే అలవాటు అయితే టీవికి బదులు చక్కని సంగీతం వినే ఏర్పాట్లు చేసుకొమంటున్నారు శాస్త్రవేత్తలు .సంగీతం స్వాంతన నిస్తుంది. ఒత్తిడిలో ఉన్న నరాలకు విశ్రాంతి ఇస్తుంది. నాణ్యమైన నిద్రకోసం సౌకర్యవంతమైన వాతావరణం కల్పించుకోవాలి. నిద్రపోయే గది ప్రశాంతంగా నిద్రకు భంగం కలగనివ్వకుండా శబ్ధాలు లేకుండా ఉండాలి.