Categories
చలికాలం కోసం అమ్మయిలకు స్పెషల్ బూట్లు వచ్చాయి. జీన్స్ ,పొడవాటి చొక్క స్కర్ట్ వంటి ఆధునికమైన డ్రెస్ ధరిస్తే లోఫర్స్ ,ఎస్పాడ్రిల్లెస్ ఎంచుకొండి అంటున్నారు స్టైలిస్టులు. ఎస్పాడ్రిల్లెస్ జనపనారతో తయారు చేస్తారు. అడుగున సోల్ కూడా జనపనారతోనే ఉంటుంది. ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇక లోఫర్లు అయితే లెక్కలేనన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇక పూర్తిగా చలికాలం వచ్చేస్తే వెచ్చగా ఉండాలి అనుకొంటే యాంకిల్ చూట్టు బూట్లు ఎంచుకొంటే బావుంటుంది. ఇవి అన్ని రకాల వస్త్రశ్రేణి పైకి బావుంటాయి. చూసేందుకు అందమైన డిజైన్లలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. కాస్త సరదాగా ఏ సాయంత్రపు షికారు కో అయితే జూతీలు ఎంచుకోవచ్చు. రంగు రాళ్ళు పొదిగినవి ,సీక్వేన్ల మెరుపులతో జూతీలు చాలా బావుంటాయి.