Categories
జీన్స్ ఏ డ్రెస్ కైన సరైన మ్యాచ్ కాని జీన్స్ లో ఎన్నో వెరైటీలు ఎంపికలో కొన్ని రూల్స్ పాటిస్తే బావుంతాయి.స్కిన్‌ని జీన్స్ కాని లెంగ్గిన్స్ కాని ఏదికొన్న దాని పొడవు యాంకిల్ దాటకూడదు కాస్త పైకే ఉండాలి. స్టైల్ లెంగ్గిన్స్ అయితే యాంకిల్ అడుగు వరకు లేదా యాంకిల్ మధ్య వరకు పొడవుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బూట్ కూడా ఫ్యాషనే,ధరించే షూని బట్టి ఈ రకం జీన్స్ ఎంచుకోవచ్చు. నేలకి కాస్త పై దాక ఉండే ఈ బూట్ కట్ అందం తెస్తుంది.వైర్ లెగ్ జీన్స్ షూ ఎత్తును బట్టి హీల్స్ నుంచి కాస్త ఎత్తుగా ఉండేలా వేసుకుంటే బావుంటుంది. జీన్స్ వంటికి హత్తుకుపోయేలా ఉండకూడదు. ముందు శరీరానికి కంఫర్ట్ ఇచ్చేలా ఉండాలి.