Categories
యుక్త వయసులో పిల్లలు ఫోర్న్ సైట్స్ చూస్తున్నారనే విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తునే ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిశోధన ఇప్పుడు 14 సంవత్సరాల వయసులోనే అబ్బాయిలు శృంగారానికి అలవాటు పడుతున్నారనీ ,16 ఏళ్ళ వయసులో అమ్మాయిలు శృంగార అనుభవం పొందుతున్నారనీ తేల్చింది. ఇరవై నగరాల్లో 13 నుంచి 19 ఏళ్ళ వాళ్ళపై చేసిన పరిశోధన సారాంశం ఇది. అతి చిన్న వయసులో 6.3 శాతం అబ్బాయిలు,1.3శాతం అమ్మాయిలు శృంగార అనుభవం పొందితే 8.9 శాతం మంది లైంగిక వ్యాధికి గురయ్యారని తేలింది. మొత్తంగా వీళ్ళందరూ ఫోర్న్ సైట్స్ చూసి ఆ అనుభవం ఎలా ఉంటుందో అనుభవంలోకి తెచ్చుకొందామనుకొనేవారు.