ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫిట్ నెస్ పాఠాలు నేర్పుతున్న ఢిల్లీకి చెందిన దీక్ష చాబ్రా ఢిల్లీలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పనిచేశారు.అప్పుడు ఆమె బరువు 90 కిలోలు పై మాటే.డాక్టర్ హైపో థైరాయిడిజం ఉందని తేల్చారు. అప్పటి నుంచి ఆమె ఫిట్ నెస్ పై దృష్టిపెట్టి ఇంటర్నెట్ లో వీడియోలు చూస్తూ వ్యాయామాలు చేసి బరువు తగ్గింది.2017లో అందాల పోటిలో పాల్గొని మిసెస్ ఎర్త్ 2017 సెకెండ్ రన్నరఫ్ కిరీటం మిసెస్ బాడీఫిట్ 2017 టైటిల్ పొందింది.దీక్ష చాబ్రా ఫిట్ నెస్ కన్సల్టేషన్ ద్వారా మూడు నెలల ఫిట్ నెస్ ప్రోగ్రాంకు శిక్షణ ఇస్తుంది. ఫిట్ నెస్ అంటే బరువు తగ్గడమే కాదు బాడీని టోన్ చేసుకోవడం అంటుంది దీక్ష.