జై గురు దత్త
దత్తాత్రేయ స్వామి వారి రుపం పరబ్రహ్మ స్వరూపం.ఆయన వద్ద సేవ చేసే శునకాలే చతుర్వేదాలుగా,గోమాత పవిత్రతను,మెడలో ధరించే రుద్రాక్షలు శాంతికి,త్రిశూలానికి రౌద్రం
సంకేతాలు.

గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రం 16సార్లు పఠనం ఎంతో మంచిది.దత్తాత్రేయ స్మరణం పరమ పవిత్రం.భక్తుల మనసులో  భావాన్ని,కోరికని
ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా తీరుస్తానని
అభయం ఇచ్చే దేవుడు.నిర్మలమైన ప్రేమతో
అందరి కోరికలను మనస్పర్తిగా మన్నిస్తాడు.
ఇష్టమైన రంగు:తెలుపు, కాషాయం

ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందంఆనందంగా స్వికరిస్తాడు.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,పాలు.
మనం ఏదైన తినేటప్పుడు ముందుగా దత్త సాయికి కొద్దిగా సమర్పించాలి. అలా నిత్యం గుర్తు పెట్టుకుని చేస్తే దత్తాత్రేయ స్వామి వారి కటాక్షం తథ్యం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment