Categories
-డి. సుజాతాదేవి
ఎన్ని నోముల పున్నె మోయి నీ
ఎంట నడుసుటె బాగ్గెమోయి మావ
ఎన్ని నోముల పున్నెమోయి
పెళ్ళి సూపుల కొచ్చిన నాడె
కళ్ళు కళ్ళు కలిసిన నాడె
మళ్ళజాలని మనసు
మారాము చేసింది!!
తలపాగ పొగసున సుట్టి
తరిలీ నువ్వొచ్చినవాడు
ఈది ఈదంతా నిన్ను
ఇరగాబడి చూసింది!!
పచ్చంగా పందిట్టొ
అచ్చింతా ఎడగానె
అచ్చంగా దేవతలు
వచ్చి దీవించారు!!
కతలోని రాజల్లె
కదిలీ నువ్వొత్తంటె
వొళ్ళంతా కళ్ళాయె
కళ్ళేమొ బరువాయె!!