అమ్మాయిలు కొత్త కొత్త హెయిర్ స్టయిల్స్ లో చూడచక్కగా బావుంటారు. కానీ జుట్టు దెబ్బతినిపోతూ ఉంటుంది. జుట్టు బాగా వెనక్కి దువ్వటం చేస్తారు. అలా కొన్నాళ్ళకు దువ్వుకొన్నాక మళ్ళీ పాపిడి తీసేందుకు ప్రయత్నం చేస్తే జుట్టు రాలిపోతుంది. నడి నెత్తి పైన కొప్పు ఫ్యాషన్ ఆ కొప్పు కోసం గట్టిగా దువ్వి మాడు వరకు పైకి లాగి కట్టడం వల్ల నొప్పి పుడుతుంది. కురులు లాగినట్లు అయి దెబ్బతిని జుట్టు పలచబడుతుంది. పిల్లలకు జుట్టు చెదిరిపోకుండా బిగితుగా లాగి జడలు వేస్తారు. పదే పదే లాగి జడలల్లటం వల్ల కూడా కుదుళ్ళు బలహీనపడి జుట్టు ఊడిపోతుంది. పోని బెయిల్స్ కోసం వెనక్కి లాగి బిగించి కట్టడం వల్ల జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి.

Leave a comment