పెళ్ళిళ్ళకు ,సంప్రదాయ సందర్భాలకు చిరె కట్టే అందం. పైగా శారీ డ్రెపర్స్ వచ్చారు . పెళ్ళిళ్ళకు వేడుకలకు వాళ్ళే చీరె అందంగా కట్టేసి ప్రత్యేకంగా కనబడేలా చేస్తారు కూడా. ఈ చీరెకట్టు ఎక్సపర్ట్స్ ,కలకత్తాకు చెందిన డాలీజైన్ చీరకట్టులో సన్నగా కనిపించాలంటే షిఫాన్ జార్జెట్ సిల్క్ క్రెప్ వంటి జాలువారే వస్త్రాలు ఎంచుకోమంటుంది కాలిన్ ఆర్గంజా వంటి వస్త్రశ్రేణులు భారీగా కనిపిస్తారు. శరీరాకృతి కనబడకుండా చేయాలంటే ముదురు రంగు మెరూన్ ,నలుపు ఎంచుకోవాలి. చిన్న ప్రింట్లు డిజైన్లు,చిన్న అంచుల చీరెలు సన్నగా కనపడేలా చేస్తాయి. సన్నని బార్డర్లు చాలా బావుంటాయి ఎక్కువ కుచ్చుళ్ళు పెట్టుకోకూడదు సన్నగా ఉండాలంటే చాలా తక్కువ కుచ్చుళ్ళే ఉండాలి. అధిక బరువు ఉంటే తేలికైన అంచున్న చాందినీ ,మైసూర్ సిల్క్ చీరెలు కట్టుకోవాలి.
Categories