లాక్ డౌన్ సమయం సద్వినియోగం చేసుకొనేలా ఓ సినిమా చూడాలి అనుకొంటే ‘ Bicycle Thieves ‘ సినిమా చూడాలి. 1948 లో కథ ఇది రోమ్ లో ఉన్న రిచీ అనే అతనికి ఓ ఉద్యోగం దొరికింది. ఆ జాబ్ చేయాలంటే సైకిల్ ఉండి తీరాలి. ఇప్పటి లాగా కార్లు,బైక్ లు లగ్జరీ వాహనాలు లేనికాలం. అప్పట్లో సైకిల్ వుంటే గొప్పే అంతకు ముందే అవసరాల కోసం తాకట్టు పెట్టిన సైకిల్ ను ఇంట్లో ఉన్న దుప్పట్లు మొత్తం అమ్మి ఆ సైకిల్ తెచ్చుకొని ఉద్యోగానికి వచ్చాడు. ఇంతకీ ఆ ఉద్యోగం కాస్తా గోడలకు సినిమా పోస్టర్స్ అంటించేది ఆలా పైకెక్కి అంటిస్తూ ఉంటే ఎవరో దొంగ ఆ సైకిల్ ఎత్తుకు పోతాడు కొడుకుని వెంట బెట్టుకొని సైకిల్ కోసం వెలుతున్న రిచీ కి పోనీ నేనే ఓ సైకిల్ కొట్టేస్తే అన్న ఆలోచన వచ్చి ,ఓ వీధిలో గోడకి ఆనించి ఉన్న సైకిల్ ఎత్తుకు పోయి దొరికి పోతాడు. రిచీ ని జనం తన్నబోతారు కానీ కొడుకు ఏడుపు చూసి కోప్పడి వదిలేస్తారు. రిచీ కొడుకు తో ఇంటి దారి పట్టాడు. ఈ సినిమా లో ప్రతి వాళ్ళు తమకు తాము చూసుకొన్నారు. ఇక ఈ సినిమా కు వచ్చిన అవార్డ్ లకు లెక్కలేదు. ఇంగ్లీష్ ఛానల్ బిబిసీ రూపొందించిన విదేశీ ఉత్తమ చిత్రాల జాబిదాలో భైస్కిల్ థీవ్స్ రెండవ స్థానంలో నిలిచింది.
Categories