ది వారియర్ కలెక్షన్స్ పేరుతో నర్సులకు పెళ్లి గౌన్లు తయారు చేసి ఇస్తోంది ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డ్రెస్ డిజైనర్ సోనాక్షి రాజ్ మెరానీ.కరోనా సోకిన రోగులకు సేవలు అందిస్తున్న నర్సులకు తన వంతు కానుకగా ఈ చక్కని దుస్తులు తయారుచేసింది సోనాక్షి రాజ్.వారు చేస్తున్న సేవలు మరువలేనివి.ఈ మధ్యనే నాకు పెళ్లి అయింది.నవ వధువుగా మనసు ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు.ఈ ఆలోచనే వారియర్ కలెక్షన్ కు దారి తీసింది కోవిడ్-19 రోగులకు సేవలందించే నర్సు లందరికీ ఈ పెళ్లి గౌనులు ఇస్తాను అంటోంది సోనాక్షి రాజ్ మెరానీ.