Categories
నిద్ర పోయే భంగిమల్లో కూడా ఆరోగ్యం ఉంటుంది అంటారు ఎక్సపర్ట్స్. వెల్లికిలా పడుకొంటే ప్రశాంతమైన నిద్ర పడుతోంది బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అంటున్నారు. ముఖం పై వత్తిడి తగ్గి ముడతలు రాకుండా ఉంటాయి. పాడుకొనే భంగిమల్లో ఇది అత్యుత్తమమైనది అంటారు అధ్యయనకారులు. మరీ ఎక్కువ ఎత్తులేని దిండు వాడుకోవాలి. ముందు వెల్లికిలా పడుకొని తర్వాత ఎదో ఒక పక్కకు తిరిగి నిద్రించటం మంచి భంగిమ అంటారు. ఇలా పక్కకు తిరగటం వల్ల రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. మెడనొప్పి వచ్చే అవకాశాలు తక్కువ అన్నింటికంటే బోర్ల పడుకొని నిద్ర పోవటం మాత్రం చాలా తప్పు. వెన్నెముక స్థిరంగా ఉండక కీళ్లు కండరాలపై వత్తిడి పెరిగి నొప్పి కలుగుతోంది. ఎక్కువ సమయం ఇలా పడుకొంటే మెడనొప్పి బాధిస్తుంది.