చర్మం రంగులు తెల్లబరిచే తమ ఉత్పత్తుల శ్రేణిని నిలుపు చేస్తామని జాన్సన్ సంస్థ ప్రకటించటం కొంతవరకు బాధ్యతను గుర్తించినట్లే కదా.మనం ఇన్నాళ్లు అందానికి సంబంధించిన తెల్లగా ఉంటే అందం అన్న తప్పుడు భావనలు మోసుకుంటూ తిరుగుతున్నాం. దాని ఆధారంగా రంగు పెంచే వ్యాపారం వంద కోట్ల మేరకు సాగుతోంది.దాన్ని అరికట్టేందుకు ఇప్పుడైనా మనం ఒకటి కావాలి అంటోంది నందితాదాస్.సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సినీ నటి దర్శకురాలు నందితాదాస్.డార్క్ ఈజ్ బ్యూటి ఫుల్ ఉద్యమాన్ని నేను పునరుద్ధరించాను.మరింత మందిని దానిలో చేర్చుకోవడానికి వైవిధ్యాన్ని వేడుక చేసుకోవటానికి ఇండియన్ గాట్ కలర్ అని పేరు పెట్టాను ఇది సముద్రంలో నీటి బిందువంత వస్తే కానీ ప్రతి బిందువు మనల్ని కెరటం అంచుకు దగ్గరగా తీసుకుపోతుంది అంటుంది నందితాదాస్.అందంగా ఉండటం అంటే కేవలం తెల్లగా ఉండటం కాదనే ప్రచారాన్ని ముందుకు తీసుకుపోదాం అంటుంది నందితాదాస్.