పుష్కలంగా పోషకాలున్న పన్నీర్  ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. వెన్న తీయని పాలతో చేసే పనీర్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల పన్నీర్ లో 80 శాతానికి పైగా ప్రొటీన్లుంటాయి.క్యాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది పన్నీర్ లోని ఫాస్పరస్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇందులో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది శరీరానికి విటమిన్ బి అందుతుంది.గర్భిణీలకు అవసరమైన శక్తినిచ్చి గర్భస్త శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చిన్న పిల్లల ఆహారం లో పన్నీర్ చేరిస్తే వారి ఎముకల ఎదుగుదలకు దోహదపడుతుంది. పిల్లల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a comment