Categories
సరైన నిద్ర ఒత్తిడి పరిసరాలు పోషక లోపాలు కూడా మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి తీసుకునే ఆహారం మెదడు నిర్మాణం పనితీరు ద్వారా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషక ఆహారాన్ని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. నిరాశ ఆందోళన లక్షణాలు నివారించేందుకు సమతుల ఆహారం సహాయపడుతుంది.ఒమేగా-3 కొవ్వులు అధికంగా ఉండే చేపలు థియోబ్రోమైన్, ఫ్లేవనాయిడ్స్ ఉండే ముదురు చెక్ లెట్, ప్రొబియోటిక్స్ వుండే పెరుగు, మజ్జిగ, అరటి, ఆపిల్, దానిమ్మ, నల్ల ద్రాక్ష, ముడి ధాన్యాలు గింజలు పప్పు ధాన్యాలు మానసికస్థితిని ఉత్సాహపరిచే ఆహారం.