ప్రపంచం అథ్లెటిక్ పోటీలలో గెలిచి ప్రశంసలు అందుకుంది లాంగ్ జంప్ క్రీడాకారిణి అంజు బాబీ జార్జ్. కేరళలోని కొట్టాయం మాది చిన్నతనం నుంచే నన్ను స్పోర్ట్స్ లో ఉండాలనే ఆలోచనతోనే శ్రద్ధగా పెంచారు. స్పోర్ట్స్ హాస్టల్ లోనే పెరిగాను అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు తయారవుతున్నప్పుడే నాలో అనారోగ్య లక్షణాలు కనిపించాయి.పరీక్షల తర్వాత నాకు ఒకే కిడ్నీ ఉందనీ,నేను ఆటలకు పనికిరానని తేల్చారు డాక్టర్లు. నా భర్త బాబీ జార్జ్ కోచ్ నాకు అండగా ఉన్నారు.శిక్షణ రీతిని శరీర పరిస్థితికి అనుగుణంగా మార్చారు ఆయన ధైర్యం ఇవ్వటం వల్లే పారిస్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ పోటీలలో కాంస్య పతకం గెలుచుకున్న ప్రపంచ అథ్లెటిక్స్ లో దేశానికి చెందిన మొదటి పథకం అంటూ తన విజయగాధలు చెప్పుకొచ్చింది అంజు బాబీ జార్జ్.

Leave a comment