Categories
మమ్ముట్టి ఫహార్ పజిల్ నటించిన ఈ మలయాళం చిత్రం ఇమాన్యుయల్ మనుష్యలలో మంచి తనాన్ని ,మానవత్వ విలువలను ప్రదర్శించిన చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇమాన్యుయల్ ఒక పబ్లిషింగ్ సంస్థలో పనిచేస్తుంటాడు అనుకోకుండా ఆ కంపెనీ మూత పడటంతో ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగం లో చేరుతాడు. ఇలాంటి ప్రవేట్ సంస్థలు కస్టమర్ల భవిష్యత్ కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పని చేయటం ఇమాన్యుయల్ భరించలేక పోతాడు మానవత్వం ఉన్న మనిషిగా క్లైంట్స్ అవసరాలను అర్థం చేసుకుని సాయం చేస్తాడు కానీ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారాలేకపోతాడు.అతని మంచితనం కేవలం లాభం కోసమే పనిచేసే మేనేజర్ ని మార్చేస్తుంది.ఇమాన్యుయల్ వంటి మంచి మనుషులు తమ పాజిటివ్ యాటిట్యూడ్ ప్రపంచాన్ని, మనుషులను ఆనంద పెట్టగలదని నిరూపిస్తుందీ సినిమా ప్రైమ్ లో ఉంది తప్పక చూడండి.
రవిచంద్ర .సి
7093440630
|