Categories
స్త్రీలపై జరిగే హింస కు వ్యతిరేకంగా వన్ బిలియన్ రైజింగ్ కాంపెయిన్ లో భాగంగా సైకిల్ యాత్ర చేస్తున్నారు 24 ఏళ్ల సబితా మహతో, 21 ఏళ్ల శృతి రావత్. స్త్రీలపై జరిగే హింస కు వ్యతిరేకంగా చైతన్యం ప్రచారం కలిగించాలని అమెరికన్ ఫెమిస్ట్ ఈవ్ ఎన్స్‌లర్ మొదలుపెట్టిన కార్యక్రమం లో భాగంగా రైడ్ టు రైజ్ పేరుతో 85 రోజులు వీరు యాత్ర చేస్తారు. బీహార్ కు చెందిన సబితా మహతో ఉత్తరాఖాండ్ కు చెందిన శృతి రావత్ అట్లారి సరిహద్దు దగ్గర మొదలు పెట్టి ఈ యాత్ర ట్రాన్స్ హిమాలయా గా పేరు పొందిన ఆరు హిమాలయ పర్వత శ్రేణులను కవర్ చేస్తారు. ఐదు వేల కిలోమీటర్లకు పైగా ఉండే ఈ దూరం పూర్తిచేసేందుకు మూడు నెలలు పట్టవచ్చు. ఈ ఇద్దరు పర్వతారోహకులే.