మామిడి పండ్ల చెట్టుకు కాపలా కోసం నలుగురు గార్డులు ఆరు కుక్కల్ని ఏర్పాటు చేశాం అంటే వినేందుకు ఎలావుంటుంది. పైగా రెండు చెట్లకు ఏడే పండ్లు. అంత ప్రత్యేకం ఏమిటంటే కిలో మామిడి పండ్ల ధర 2.7 లక్షలట. జపాన్ లోని మియాజాకి ప్రాంతానికి చెందిన ఈ అరుదైన మామిడి పండ్లు మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని రాణి, సంకల్ప్ అనే భార్య భర్తలకు చెందిన కాశాయి. అవి మామూలు మొక్కలే అనుకొన్నారు కానీ వాటికి కాసిన రూబీ రంగు పండ్లను చూశాక అవి అపురూపమైనవని తెలుసుకోలేకపోయారు ఈ మియాజాకీ పండ్లను మొదటి కాపులో కొన్నింటిని దొంగలు కోసుకు పోయారు కూడా గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ లో కిలో పండ్లు రెండు లక్షల 70 వేలకు అమ్ముడయ్యాని విన్నాక ఈ దంపతులు తమ చెట్లకు ప్రత్యేక కాపలా ఏర్పాటు చేసుకొన్నారు. ఈ సంవత్సరం రెండు చెట్లకు కలిపి ఏడు పండ్లే ఉన్నాయి . ఈ పండ్ల మొక్కలు తమకు చెన్నయ్ వెళుతున్నప్పుడు తారసపడ్డ తోటి ప్రయాణీకుడు ఇచ్చాడని వీటిని సొంత బిడ్డల్లాగా పెంచుకోండి అన్నడానీ,కానీ అప్పుడు ఇవి అత్యంత అపురూపమైనవని తమకు తెలియదని చెపుతాడు సంకల్ప్. తీరా పండ్లు కాశాక ఆ ఎర్రని పండ్ల ని చూసి అవి, ఏ జాతికి చెందినవో వాటి పేరేమిటో తనకు తెలియలేదు కానీ ప్రేమగా తన తల్లి పేరిట దామిని అని పిలుచు కుంటున్నమంటున్నారు సంకల్ప్ (Damini) మధ్యప్రదేశ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ ఆర్ ఎన్ కఠారా (Katara) ఈ మొక్కల్ని పండ్లనీ చూసి ఇవి అరుదైన రకానికి చెందిన పండ్లనీ, ఎక్కువ పంట లేకపోవటం వల్ల ఇంత ఖరీదు పలుకుతున్నాయని కానీ రుచి మటుకు ఎంతో తియ్యగా రుచిగా ఉంటుందని వీటిని సాగు చేయాలని చూస్తున్నామని చెబుతున్నారు సంకల్ప్ అయితే వీటిని తాను ఎంత ఖరీదు ఇచ్చినా అమ్మనని, ఆ పండ్లతో ఇంకొన్ని మొక్కల్ని పెంచాలనుకుంటున్నానాని చెబుతున్నాడు.మొత్తానికి జపాన్ మియాజాకీ పండ్లు మన దేశానికి వచ్చాయన్న మాటే కదా !
Categories