రోజుకు 30 నిముషాలు నడకతో మరణాల రేటు 32 శాతం తగ్గుతుందని హార్వర్డ్ స్టడీ చెపుతోంది. నడకతో వత్తిడి స్థాయి గణనీయంగా తగ్గించగలిగి, ఎండార్ఫిన్ లు విడుదలవుతాయి. కంటికి కాలుకు చాలా దూరం ఉన్నా నడక వల్ల కంటి ప్రెజర్ తగ్గుతుంది, గ్లూకోమా రాకుండా ఉంటుంది. నడక కార్డియో వాస్కులర్ వ్యాధులను స్ట్రోక్ లను అడ్డుకోగలదు అధిక రక్తపోటును తగ్గించి,కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్త సరఫరాను మెరుగుపరచడం ద్వారా గుండె సమస్యలు నివారించటంలో సహాయపడుతుంది. వాకింగ్ ఊపిరితిత్తుల సామర్ధాన్ని బలోపేతం చేస్తుంది. శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి పరి రక్షిస్తుంది. డయాబెటిస్ ను నియంత్రించటంలో ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో కొవ్వు కరిగి కండరాలు ముఖ్యంగా లీనర్ గా కనపడతాయి. ప్రతిరోజూ పదివేల అడుగులు వేయటం ద్వారా కండరాల టోనింగ్ సాధ్యమవుతుంది. అరగంట పాటు నడక జాయింట్ల నొప్పి నుంచి విముక్తినిస్తుంది. వెన్నుముక కండరాల ఫ్లెక్సిబిలిటీ బావుంటుంది. క్రమం తప్పని నడక మూడ్ స్వింగ్స్ ని ఒత్తిడిని డిప్రెషన్ యంగ్జయిటీ స్థాయిలను తగ్గిస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న నడక ను నిత్య జీవితం లో భాగంగా చేసుకోవాలి.
Categories