Categories
సంకల్పబలం ఉంటే వయసుతో సంబంధం లేదు అని నిరూపించింది కొచ్చి కి చెందిన 71 ఏళ్ల రాధా మణి. జెసిబి, రోడ్ రోలర్, సహా బుల్డోజర్ ట్రక్ వంటి 11 రకాల భారీ వాహనాలు నడపగలరామే.ఆమెకు హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ ఉంది. డ్రైవింగ్ స్కూల్ నిర్వహించే భర్త దగ్గరే డ్రైవింగ్ నేర్చుకుంది. భర్త మరణించాక కుటుంబ భారం నిర్వహించడం కోసం డ్రైవింగ్ స్కూల్ బాధ్యత తీసుకుంది. 71 ఏళ్ల వయసు లో లోడ్స్ తీసుకు పోయే ట్రైలర్లు ఫోర్క్ లిఫ్ట్ లు రోడ్ రోలర్ లు చక్కగా నడపగలరు. వాటి రిపేర్లు కూడా అలవోకగా చేయగలరు రాధా మణి.