
తెల్ల ద్రాక్ష ,నల్ల ద్రాక్ష రంగేదైనా కానివ్వండి తినేందుకు ఎంత బావుంటాయి సౌందర్య పోషణలో అంతే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ద్రాక్ష పండ్లు సహజ క్లీన్సర్లుగా పనిచేసి చర్మం పై ఉండే మురికి పోగొడతాయి. కాబట్టి సౌందర్య నిపుణులు చర్మ రక్షణలో భాగంగా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎండలో ముఖం వాడిపోతే కప్పు ద్రాక్షపండు గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకుంటే పది పదిహేను నిమిషాల్లో మొహం తేటగా అయిపోతుంది. వయసు పెరగటం వాళ్ళ వచ్చే మడతల్ని కూడా ఈ ద్రాక్ష గుజ్జు మాయం చేస్తుంది. ప్రతి రోజూ రాసుకున్నా నష్టం ఏవీ లేదు. ద్రాక్ష గుజ్జులో పెరుగు తేనె కలిపి మాస్క్ వేసుకున్నా ముఖం మృదువుగా కనిపిస్తుంది. పొడి చర్మం గలవాళ్ళు ద్రాక్ష గుజ్జులో పచ్చి సోనా కలిపి మాస్క్ వేసుకుంటే మొహం తేమగా ఉంటుంది.