Categories
ఈ ప్రపంచంలో పనికి రానిది ఏదీ ఉండదని నిరూపించింది పాకిస్థానీ సామజిక కార్యకర్త నర్గీస్ లతీఫ్. పనికి రాణి చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్ధాలతో పేద ప్రజలకు ఇల్లు కట్టించి ఇస్తోంది. గుల్బహార అన్న పేరుతో సంస్థ స్థాపించి పరిశ్రమలు దుకాణాలు షాపింగ్ మాల్స్ నుంచి ప్లాస్టిక్ వ్యర్ధాలు కొనుగోలు చేసింది. వాటిలో నిరుపేదలకు గృహాలు నిర్మించింది. ఇప్పుడు ఆ ఆలోచన కరాచీ పరిసర ప్రాంతాల్లో మంచి ఫలితాన్నే ఇస్తోంది. 1960 లో ఆమె చేపట్టిన ఉద్యమం నేడు సానుకూల ఫలితాలు ఇస్తోంది. చెత్త పర్యావరణానికి హాని చేస్తుందని భావించి దాన్ని ఎలా సద్వినియోగం చేద్దామనే ఆలోచనకు పదును పెడితే వ్యర్ధ పదార్థమైనా పనికొచ్చే వనరు అవుతుందని ఆమె 50 ఏళ్ల పాటు కృషి చేసింది.