రవివర్మ వేసిన లక్ష్మీ దేవి పెయింటింగ్ ఆమెకు నాలుగు చేతులుంటాయి. ఈ నాలుగు చేతులు ధర్మం లేదా సరైన చర్య అర్ధం అంటే జీవితపు విలువ ఆహ్లాదకరమైన పనులు అంతిమంగా స్వేచ్ఛ ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాలన్నీ భారత మహిళల్లో చూడచ్చు. శక్తి ఔదార్యం తీర్పులివ్వని ధోరణి కనికరం కరుణ మూర్తీభవించిన మహిళ ఆమె. నానాటికీ తన వ్యక్తిత్వంలో మరెన్నో గుణాలు శక్తీ నింపుకుంటోంది. గత శతాబ్దం లో మహిళలు ప్రతి రంగం లోనూ తమదైన సత్తా చాటుకుని తమ వృత్తుల్లో సెటిలయ్యే నాటికీ వారిలోని శారీరిక గడియారం గడియారం మరింత శ్రీఘ్రంగా కదులుతోంది. ఇల్లాలి పాత్ర పోషించేశక్తి సంక్షోభం ఎదుర్కునే శక్తీ వాళ్లలోనే ఉంది. ప్రతి పురుషుడి విజయం వెనకా ఒక స్త్రీ ఉంటుందన్న పాత సూత్రం కొత్త దానికీ వర్తిస్తుంది. సంతోషపూరితమైన వైవాహిక జీవితాన్ని ఆమె అనుభవించగలిగితే ఆమెకు మద్దతు ఇచ్చే భర్త లభిస్తే జీవితంలో వృత్తిలో ఒడిదుడుకుల్ని ఆమె మరింత సౌకర్యంగా సమర్ధవంతంగా ఎదుర్కోగలదు. ఈ ఆధునిక మహాలక్ష్మికి తనదంటూ సొంత ప్రతిపత్తి ఉండాలనే పోరాట పటిమ తో పాటు కలలు సంతోషం ప్రేమించే కుటుంబం కోసం పోరాడే స్ఫూర్తి ఉన్నాయి. నేటి మహిళ ఆర్ధికంగా స్వతంత్రురాలు. జీవితాన్ని అందమగా మలుచుకోగల సమర్ధురాలు. ఆమె కోసం మీ ఇంట్లో ఉన్న చోటేంత? హృదయంలో ఉన్న స్థానం ఏమిటి ? ఆమెకు ఇవ్వగలిగిన బహుమతులు ఏమిటి ? ఓసారి ఊహించండి. కేవలం మెప్పుకోలు ఓ పొగడ్తా.....
Categories
WoW

ఒక చిరునవ్వు పొగడ్తా ఇవ్వండి చాలు

రవివర్మ వేసిన లక్ష్మీ దేవి పెయింటింగ్ ఆమెకు నాలుగు చేతులుంటాయి. ఈ నాలుగు చేతులు ధర్మం లేదా సరైన చర్య అర్ధం అంటే జీవితపు విలువ ఆహ్లాదకరమైన పనులు అంతిమంగా స్వేచ్ఛ ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాలన్నీ భారత మహిళల్లో చూడచ్చు. శక్తి ఔదార్యం తీర్పులివ్వని ధోరణి కనికరం కరుణ మూర్తీభవించిన మహిళ ఆమె. నానాటికీ తన వ్యక్తిత్వంలో మరెన్నో గుణాలు శక్తీ నింపుకుంటోంది. గత శతాబ్దం లో మహిళలు ప్రతి రంగం లోనూ తమదైన సత్తా చాటుకుని తమ వృత్తుల్లో సెటిలయ్యే నాటికీ వారిలోని శారీరిక గడియారం గడియారం మరింత శ్రీఘ్రంగా కదులుతోంది. ఇల్లాలి పాత్ర పోషించేశక్తి సంక్షోభం ఎదుర్కునే శక్తీ వాళ్లలోనే ఉంది. ప్రతి పురుషుడి విజయం వెనకా ఒక స్త్రీ ఉంటుందన్న పాత సూత్రం కొత్త దానికీ వర్తిస్తుంది. సంతోషపూరితమైన వైవాహిక జీవితాన్ని ఆమె అనుభవించగలిగితే ఆమెకు మద్దతు ఇచ్చే భర్త లభిస్తే జీవితంలో వృత్తిలో ఒడిదుడుకుల్ని ఆమె మరింత సౌకర్యంగా సమర్ధవంతంగా ఎదుర్కోగలదు. ఈ ఆధునిక మహాలక్ష్మికి తనదంటూ సొంత ప్రతిపత్తి ఉండాలనే పోరాట పటిమ తో పాటు కలలు సంతోషం ప్రేమించే  కుటుంబం కోసం పోరాడే స్ఫూర్తి ఉన్నాయి. నేటి మహిళ ఆర్ధికంగా స్వతంత్రురాలు. జీవితాన్ని అందమగా మలుచుకోగల సమర్ధురాలు. ఆమె కోసం మీ ఇంట్లో ఉన్న చోటేంత? హృదయంలో ఉన్న స్థానం ఏమిటి ? ఆమెకు ఇవ్వగలిగిన బహుమతులు ఏమిటి ? ఓసారి ఊహించండి. కేవలం మెప్పుకోలు ఓ పొగడ్తా…..

Leave a comment