మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు చెపుతూనే ఉంటారు. సోడియం నరాల ఇంపల్స్ ని ట్రాన్స్మిట్ చేయటానికీ మజిల్ ఫైబర్ తో కాంట్రాక్ట్ రావటానికి సాయ పడుతుంది. ఇందుకు కొద్దిపాటి ఉప్పు చాలు. అంటే రోజుకు సగం కంటే ఎక్కువ టీ స్పూన్ పరిమాణం చాలు. ఉప్పును అధికంగా వాడితే కార్డియో వాస్క్యుల్లర్ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. దైనందిన ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించి సహజ రుచిని ఇచ్చే వాటిని ప్రత్యామ్నాయం చేసుకోవాలి. స్పైస్ లు డ్రై లేదా తాజా హెర్బ్స్ వాడుతుండాలి. మిరియాలు దాల్చిన చెక్క పసుపు ఆవాలు యాలకులు తులసి ఆకులు కసూరీమేతి వంటి వాటిని వాడాలి. క్వాన్ట్ ట్రిన్స్ట్ లేదా ప్రాసెస్ ఉత్పత్తులు తగ్గించాలి. కూరగాయల్ని గ్రిల్ చేయటం రోస్ట్ చేయటం ద్వారా వాటిలోని సహజమైన తీపిని  వెలికి తీయాలి. వీటికి కొద్దిపాటి ఉప్పు జతచేస్తే రుచి దక్కుతుంది. ఏ పదార్ధాలు కొని ఉడికించినా తక్కువ స్థాయిలో ఉప్పు అన్న సూత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

Leave a comment