వర్షం కురిస్తే జ్వరాలు, ఇన్ ఫెక్షన్లు సర్వ సాధారణం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వల్ల ఇటువంటి వాటికి దూరంగా ఉండవచ్చు. ద్రవ పదార్ధాలు ముఖ్యంగా సూప్ లు టీ, కాఫీ, వెచ్చని ద్రవాలు త్గడం తో ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉండవచ్చు. అలాగే తాజా పండ్లు, కూరగాయలు వీలైనన్ని సార్లు తినాలి. పెరుగు, ఓట్స్, బార్లీ, వెల్లుల్లి, చికెన్ సూప్, గ్రీన్ టీ, లవంగాలు, అల్లం మిరియాలు, కాప్సికం, పాలకూర, బాదం, పప్పులు, పసుపు వాడకం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చల్లగా వుండే వాతావరణంలో బద్ధకం తెచ్చుకోకుండా ఎదో ఒక ఎక్సర్ సైజ్ చేయాలి. ఏ ఎరోబిక్స్ చేసినా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవ్వుతుంది. వీలైనంత వరకు శరీరానికి సూర్య రశ్మి సోకే విధంగా జాగ్రత్త పడాలి. మంచి నిద్ర మంచి ఆహారం, మంచి వ్యాయామం ఇవే అరిగ్య హేతువులు.

Leave a comment