వేపాకులు తులసీ ఆకుల్లో ఎన్నెన్నో ఔషధ గుణాలున్నాయని ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని శాస్త్రీయంగా రుజువయ్యాయి. ఇంకెన్నో కొత్త పరోశోధనా ఫలితాలు వస్తూ వుంటాయి కదా. వేపాకుల పేస్ట్ వార్ట్స్ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ చికిత్సల్లో బాగా పనిచేస్తుంది. వేపాకులు కాచి వడకట్టిన నీరు తాగటం వల్ల అధిక రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. వేపాకుల గింజలు బెరడు ల్లో వుండే కొన్ని గుణాలు ఆర్థరైటిస్ ను సహజంగా నయం చేయగలరు. వేపనూనె మస్సాజ్ చేస్తే కండరాల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే తులసి సుగుణాలు అనేకం . నీళ్లలో అర టీ స్పూన్ ఎండు లేదా తాజా తులసి ఆకులపొడి పేస్ట్ కలుపు కొని తాగితే అజీర్ణం తగ్గిపోతుంది. తులసి ఆకులు మరిగించి ఆవిరి పెట్టుకోవటం వల్ల తలనొప్పి తగ్గిపోతుంది. తులసి ఆకుల రసాన్ని గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే వత్తిడి తగ్గిపోతుంది.
Categories