పండగంటే గుర్తొచ్చేది పట్టే. ఇక పట్టంటే కాంచీవరం పట్టే. పట్టు పురుగుల నుంచి తీసిన సహజమైనపట్టుకు బంగారు జరీ కలిపి చేతులతో మగ్గం పై నేసారు. 800 గ్రాముల నుంచి కిలో బరువు వరకు వుంటుందీ కంచి చీర స్వచ్ఛమైన పట్టు జరీ మిశ్రమంతో నిండైన చీర సృష్టించటం ఇక్కడి నేత కళాకారులకు అలవాటైన విద్య కర్ణాటక నుంచి తెప్పించే పట్టు కండీ కి సూరత్ బంగారు జరీ కలిస్ చీర ప్రైజ్ విడివిడిగా వేసి మూడింటినీ కలిపేదే కాంచీపురం సంప్రదాయం పట్టుచీర. చారలు చెక్స్ టెంపుల్ బోర్డర్ తో పూలబుట్టలతో వచ్చే కంచి చీరలు కాంచీపురఖ్త్మ్ దగ్గరలోని వేగావతి నీళ్లతో రంగులద్దుతారు. ఇప్పుడు 50 రంగుల్లో దొరుకుతున్న కంచి చీరల్ని ఫ్యాషన్ కోసం హాఫ్ జరీ చీరలు వేయటం మొదలుపెట్టారు. అలాగే వన్ గ్రామ్ జరీ చీరలు కూడా నేస్తున్నారు. పండగ స్పెషల్ అయితే సూర్యుడు చంద్రుడు హంసలు ఆకులతోపాటు మల్లెమొగ్గలు కలయికతో మల్లినాగు చీరలు కూడా వున్నాయి. రాజా రవివర్మ గీసిన చిత్రాలు మహాభారత రామాయణ గాధలు కొంగుపైన కనిపించే ఈ చీరలు సంక్రాంతికి ప్రత్యేకమైన అందం ఇస్తాయంటే ఆశ్చర్యం లేదు. పండగ కోసం ముదురు రంగులు కాకుండా కాంతివంతంగా ఉండే పిస్తా పచ్చ నీలం కాషాయం పసుపు గులాబీ ఎరుపు రంగులు బావుంటాయి. ఈ అందమైన కాంచీవరం పట్టుకు తోడు టెంపుల్ డిజైన్ నగలు జోడిస్తే ఇక పండగ కళ వచ్చేసినట్లే !
Categories