బెల్ పెప్పెర్స్ స్వీట్ పెప్పెర్స్ గా పిలుస్తారు గానీ మనకు తెలిసిన వాడకంలో ఉన్న పేరు క్యాప్సికం . గంట లాంటి ఆకారంలో ఉంటుంది కదా . అవి ఇలా పిలుస్తారు. ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగుల్లో మనకు దొరికే ఇవి పుష్కలమైన పోషకాల నిలయం విటమిన్ ఏ , సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ బి6 అధికంగా వుండే పీచు ఇది ఖచ్చితమైన లోఫ్యాట్ పదార్ధం. జీవక్రియ ప్రక్రియను పెంచి కొవ్వు కరిగించే ఈ క్యాప్సికం కండరాల నొప్పికి మంచి ఉపశమనం. అలాగే స్వీట్ పెప్పర్ టేస్ట్ బావుండటంతో పాటు చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడతాయి. ఇది కారంగా ఉండదు. దృఢమైన యాంటీ ఇన్ఫలమేటరీ కారకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాప్సికం ముక్కలు 22 నుంచి 25 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బరువు తగ్గులను కొనే వాళ్ళకి ఇది మంచి ఆహారం. ఏ పదార్ధం తో కలుపుకున్న రుచితో పాటు పోషకాలు దక్కుతాయి . వయసు రీత్యా వచ్చే దృష్టిలోపం కాటరాక్ట్ కాకుండా అడ్డుకోవటంలో కూడా ఇది సహకరిస్తుంది.
Categories