Categories
ఈ వేసవి రోజుల్లో ఎండల్లో తల్లో మురికి చెమట చేరి జుట్టు వాసనగా ఉంటుంది. నిమ్మ రసం ఈ సమస్య నుంచి కాపాడుతుంది. నిమ్మరసం కప్పు నీళ్ళలో వేయాలి షాంపూ అయ్యాక జుట్టు కుదుళ్ళకు తగిలేలా రాసి కడిగేయాలి. జుట్టు పొడి బారినట్లు ఉంటే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత కడిగేస్తే మెత్తగా మెరుస్తూ ఉంటుంది. టామోట రసం కూడా మంచిదే. అలాగే టిట్రీ నూనెలో బ్యాక్టీరియా దూరం చేసే గుణం ఉంది. తాజా కలబంద గుజ్జు తలకు పట్టించి అలా వదిలేసి కాసేపు ఆ తర్వాత తల స్నానం చేసిన మంచిదే.