Categories
Gagana

ఆ పొదుపు సింప్లిసిటీ నీ నేర్పిస్తుంది.

మా నాన్న సెలబ్రిటీ అయినా, డబ్బుకు కొదవ లేకపోయినా నాకు పాకెట్ మనీ ఇచ్చేప్పుడు మాత్రం చాలా పొదుపు పాటించేవారు అంటుంది సోనమ్ కపూర్. పిల్లలకు డబ్బు ఉంది కదా అని ఎంత పడితే అంత ఇచ్చి విచ్చల విడి తనాన్ని నేర్పటం మంచిది కాదు కదా. అందుకే మా అమ్మ, నాన్న నా విషయంలో పాటించిన పొదుపు వల్ల నాకు లాభమే జరిగింది. నాకు తగ్గట్టే నేనుండే దాన్ని. ఫ్యాషన్ అభిరుచి కి ఆటంకం రాలేదు కానీ, నా విషయంలో పొదుపు సింపుల్ గా ఉండే అలవాటు నేర్పింది. నా ఫ్రెండ్స్ కి ఎంత మంది కి విడిగా కార్లు ఉండేవి. నా కోసం నాన్న ప్రత్యేకంగా కొనలేదు. నా తొలి సంపాదనతోనే కారు కొనుక్కొన్న. అది చూసి నాకెంతో గర్వం కలిగింది అన్నది సోనమ్. తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే పిల్లలు ఎంత బాగా పెరుగుతారో మరి.

Leave a comment